ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు 'కాగితం పడవలు' సినిమా
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ చిత్ర క్లైమాక్స్ అందర్నీ షాక్‌కి గురిచేస్తుందని దర్శకుడు తుకారం తెలిపారు. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించామని నిర్మాతలు వెల్లడించారు.