వారనాసిలో ఏబీవీపీ ఆందోళన: రక్తంతో లేఖలు రాసి విద్యార్థుల నిరసన

రిపోర్టర్: వెంకట్ స్థలం: Varanasi

బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల భద్రతతో పాటు వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు పన్నెండో రోజుకు చేరుకున్నాయని ఏబీవీపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ రక్తాన్ని ఉపయోగించి యూనివర్సిటీ అధికారులకు లేఖలు రాసి తీవ్ర నిరసన వ్యక్తంచేశారని, అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారని వారు పేర్కొన్నారు.