డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Amaravati

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ రేపు సాయంత్రం 5 గంటలకు ఏపీ గవర్నర్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కలవనున్నారు. కూటమి ప్రభుత్వ నిర్బంధకాండ, అక్రమ కేసులు, వైయస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేయనున్నారు. బెదిరింపులకు భయపడేది లేదని, అరాచకాలకు తలవంచబోమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.