ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: Hyderabad

తెలంగాణ హైకోర్టులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై హైకోర్టు న్యాయవాది జి.శ్రీకాంత్ గౌడ్ కీలక వివరాలు వెల్లడించారు. దానం నాగేందర్ అనర్హత ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.