రష్యా చమురు దిగుమతులపై భారత్ కీలక ప్రకటన
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
దేశంలోని 140 కోట్ల మంది ఇంధన అవసరాలను తీర్చడమే తమ ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చమురు కొనుగోళ్లతో ముగియదని, దౌత్యమే పరిష్కారమని మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు. జాతీయ ప్రయోజనాలే తమకు మార్గదర్శకమని, ఇతరులు భారత్ విధానాలను గౌరవించాలని ఎంఈఏ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. శాంతి స్థాపన కోసం భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.