ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు వజ్రాల ముక్కుపుడక కానుకగా సమర్పించిన భక్తుడు
రిపోర్టర్: రమేష్
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
శ్రావణ శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. వరలక్ష్మీ వ్రతంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ పవిత్ర దినాన ఓ భక్తుడు అమ్మవారికి అత్యంత విలువైన వజ్రాల ముక్కుపుడక, దివ్యాభరణాలను కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాలతో అలంకరించిన దుర్గమ్మ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది.