కాణిపాకం పురవీధుల్లో రావణబ్రహ్మ వాహనంపై విహరించిన విఘ్నేశ్వరుడు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల రెండవ రోజు రాత్రి ప్రత్యేక వాహన సేవ నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారు రావణబ్రహ్మ వాహనంపై అధిరోహించి కాణిపాకం పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు.