స్వస్థల ప్రజల కోసం ముందుకు వచ్చిన స్టార్ బాస్కెట్‌బాల్ క్రీడాకารిణి
రిపోర్టర్: మహేష్
స్థలం: USA
ప్రముఖ బాస్కెట్‌బాల్ స్టార్ పేజ్ బ్యూకర్స్ తన స్వస్థలమైన మిన్నెసోటాలోని హాప్కిన్స్ ప్రజల కోసం ఉదారత చాటుకున్నారు. హాప్కిన్స్ స్ట్రాంగ్ రిలీఫ్ ఫండ్‌కు 50 వేల డాలర్ల వరకు విరాళాలను మ్యాచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆమె చొరవతో కమ్యూనిటీ నుంచి పెద్దఎత్తున స్పందన లభించి మొత్తం 1.6 లక్షల డాలర్లకు పైగా నిధులు సమకూరాయి. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆహారం, నివాస అవసరాల కోసం ఈ విరాళాలు ఉపయోగపడనున్నాయి.