నాలుగు రాష్ట్రాల్లో జనగణన షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియను కేంద్రం ముందుగానే చేపడుతోంది. డిసెంబర్ 1 నుంచి జనవరి 4 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 16 నుంచి 30 వరకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) సౌకర్యం కల్పిస్తున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.