తెలంగాణలో జనసేన పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా మారుస్తామన్న గడల
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం
తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడల శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం గట్టయ్య సెంటర్ లో పార్టీ జిల్లా కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేనను నిలబెడతామని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.