ఉత్సాహంగా సాగిన విద్యార్థుల క్రీడా ప్రతిభా వేట

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ఆవరణలో 70వ ఎస్జీఎఫ్ క్రీడా ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి పాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్, ఖో-ఖో, కబడ్డీ విభాగాల్లో అండర్-14, అండర్-17 కేటగిరీల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఎంపిక చేశారు.