అంత్యంత శక్తివంతంగా ఎల్‌నినో.. ప్రపంచ దేశాలకు WMO తీవ్ర హెచ్చరిక!

రిపోర్టర్: నరేష్ స్థలం: World

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపే ఎల్‌నినో మరింత బలపడుతోందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడంతో ఈ ఏడాది చివరి నాటికి ఇది అత్యంత శక్తివంతమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, దీని ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని డబ్ల్యూఎంఓ స్పష్టం చేసింది.