తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల నిర్వహణపై కొత్త ఆలోచన
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానం దేశవ్యాప్తంగా ఉన్న భారీ ఆస్తులు మరియు భూముల నుంచి దీర్ఘకాలిక ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ విధానాన్ని పరిశీలిస్తోంది. భక్తులు విరాళంగా అందించిన భూములు మరియు ఇతర ఆస్తులను అమ్మకుండా వాటి ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా చేయడానికి టీటీడీ ఈ సరికొత్త ప్రతిపాదనపై కసరత్తు చేస్తోంది.