వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలే మేలన్న ఖమ్మం కలెక్టర్ దివాకర

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర కోరారు. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లిలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మాట్లాడారు. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, కూరగాయలు పండించాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.