రైస్ మిల్లర్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో రైస్ మిల్లర్ల సమ్మె నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రివర్గ ఉపసంఘం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. మిల్లర్లపై అనవసర భారం మోపబోమని, ప్రజాధనం మరియు వడ్డీలను రాబట్టడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.