'మీ ఆత్మసాక్షి అంగీకరిస్తోందా?': 'మీర్జాపూర్' మూవీ మేకర్స్‌పై ఢిల్లీ హైకోర్టు ఫైర్
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
మహారాణా ప్రతాప్ జ్ఞాపకార్థం రూపొందించిన 'శూర్‌వీర్' పాటను నేరపూరిత నేపధ్యం ఉన్న 'మీర్జాపూర్: ది మూవీ'లో వాడటంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చిత్రంలో ఈ పాట వాడకం పట్ల మీ ఆత్మసాక్షి అంగీకరిస్తోందా అంటూ చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన బెంచ్ ప్రొడక్షన్ హౌస్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పాట తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, సినిమాను పూర్తిగా చూసి రావాలని ఆదేశించింది.