అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో భారీగా సినిమాల విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో తెలుగు తెరపైకి ఏకంగా పది సినిమాలు విడుదలవుతున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇన్ని చిత్రాలు వస్తున్నప్పటికీ చాలా సినిమాలకు సరైన ప్రచారం కరువైందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కొన్ని చిత్రాలపై తక్కువ బజ్ ఉన్నప్పటికీ, మరికొన్ని సినిమాలకు మాత్రం క్రేజ్ పెరిగినట్లు సమాచారం. ప్రమోషన్ల విషయంలో చిత్రబృందాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.