మురసు తుఫాను హెచ్చరిక: ఎన్టీఆర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: సతీష్ స్థలం: ఎన్టీఆర్

మురసు తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని Vijayawada City Police వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, చెట్ల కింద లేదా పాత భవనాల సమీపంలో ఉండవద్దని సూచించారు. వర్షంలో మోటార్ సైకిళ్లపై ప్రయాణించరాదని, తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని పేర్కొంటూ, పోలీస్ యంత్రాంగం సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.