నిమ్మ తోటల సంరక్షణకు పొదలకూరులో పీఎండీఎస్ కిట్ల పంపిణీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
ఎల్నినో కారణంగా తీవ్రమైన ఎండలు, వర్షాభావ పరిస్థితుల నుంచి నిమ్మ తోటలను సంరక్షించుకోవడానికి పొదలకూరు మండలంలో రైతులకు పీఎండీఎస్ కిట్లు పంపిణీ చేసినట్లు నెల్లూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎం.వి.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కిట్లలోని విత్తనాలు నేలలో తేమను నిలుపుతూ నిమ్మ చెట్లకు పోషకాలను అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన వేడికి కాయలు రాలడం వంటి సమస్యలను ఈ పద్ధతి ద్వారా నివారించవచ్చని ఉద్యానవన అధికారి ఈటె ఆనంద్ వెల్లడించారు.