ఆరోగ్యానికి ప్రోటీన్ ఎంత అవసరం: వైద్య నిపుణుల కీలక సూచనలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
శరీరానికి ప్రోటీన్ ఎంత పరిమాణంలో అవసరమనేది ప్రతి ఒక్కరిలోనూ భిన్నంగా ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అందరూ ఒకే మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం సరికాదని, వయసు, బరువు, శారీరక శ్రమను బట్టి ఇది మారుతుందని తెలిపారు. కిడ్నీ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే ప్రోటీన్ తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.