అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తమ దేశంపై మరోసారి సైనిక దాడులకు పాల్పడితే భౌగోళిక పరిమితులు లేకుండా తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు. శత్రువులు యుద్ధాన్ని ప్రారంభిస్తే దాని ముగింపు ఎలా ఉండాలో ఇరాన్ సైన్యమే నిర్ణయిస్తుందని ఖతార్ మధ్యవర్తిత్వ చర్చల నేపథ్యంలో అక్టోబర్ ముప్ పై ఒకటిన జరిగిన ఉన్నత స్థాయి సైనిక సమావేశంలో ఖమేనీ హెచ్చరించినట్లు సమాచారం.