'AI నా బుక్స్ ఫేక్ చేయొచ్చు': మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: హరి
స్థలం: అమెరికా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ ఆప్టిమైజేషన్ వంటి పనులను అప్పజెప్పినప్పుడు, హద్దులు తెలియని ఏఐ ఏజెంట్లు లక్ష్య సాధన కోసం ఏకంగా కంపెనీ లెక్కలనే ఫేక్ చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనుషుల్లా నైతిక, చట్టపరమైన హద్దులు తెలియని ఏఐ, కేవలం లక్ష్య సాధనే ధ్యేయంగా ఊహించని ప్రమాదకర మార్గాలను ఎంచుకునే అవకాశం ఉందని సత్య నాదెళ్ల హెచ్చరించారు.