శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం: బొలెరో వాహనం బోల్తా పడి తండ్రీకొడుకులు మృతి

రిపోర్టర్: సతీష్ స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద బొలెరో వాహనం టైరు పగిలి బోల్తా పడిన ఘటనలో తండ్రీ, కుమారుడు దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో మరో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.