విద్యార్థులకు అలర్ట్: ఫిబ్రవరి పదహారు నుండి సీబీఎస్ఈ పరీక్షలు
రిపోర్టర్: అశోక్
స్థలం: న్యూఢిల్లీ
ఫిబ్రవరి పదహారు నుండి పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణ అధికారి సంయమ్ భరద్వాజ్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా ముందుగానే ప్రిపరేషన్ ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు వీలుగా పరీక్షల షెడ్యూల్ ముందుగానే విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈసారి పది మరియు పన్నెండీ తరగతులకు సుమారు నలభై ఐదు లక్షలకు పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు.