సీఎం విశాఖపట్నం పర్యటనకు పటిష్ట భద్రతా వలయం ఏర్పాటు
రిపోర్టర్: అశోక్
స్థలం: విశాఖపట్నం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో నగర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏయూ ప్రాంగణంలో హెలిప్యాడ్, సభా వేదిక, రూట్ భద్రతపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, కలెక్టర్ ఎన్. అభిషిత్ కిశోర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రజల రాకపోకలపై అన్ని విభాగాల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.