నిరుద్యోగులకు భారీ షాక్: ఏఎస్ఓ విద్యార్హత నిబంధనపై అభ్యర్థుల ఆవేదన

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ఏపీపీఎస్సీ జారీ చేసిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల ప్రకటనలో పెట్టిన విద్యార్హత నిబంధనల వల్ల వేలాది మంది అభ్యర్థులు అనర్హులవుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సెమిస్టర్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సిలబస్ కుదించబడినందున, పాత నిబంధనలను సవరించి న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే పాత నిబంధనలే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేయడంతో ఆందోళన చెందుతున్నారు.