కాలేయ వ్యాధి ముప్పును ముందే గుర్తించే కీలక సంకేతాలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఫరీదాబాద్

శరీరంలో తలెత్తే కొన్ని మార్పుల ద్వారా కాలేయ వ్యాధి ముప్పును ముందుగానే గుర్తించవచ్చని అమృత హాస్పిటల్స్ వైద్య నిపుణులు డాక్టర్ షాలీన్ అగర్వాల్ వెల్లడించారు. కళ్ళు పసుపు రంగులోకి మారడం, చర్మం దురద పెట్టడం, ముదురు రంగు మూత్రం విసర్జించడం వంటి లక్షణాలు కాలేయ సమస్యలకు సంకేతాలు కావచ్చని తెలిపారు. ఎలాంటి నొప్పి లేకపోయినా ఈ మార్పులను తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.