ఎలమంచిలి పీఠం హ్యాట్రిక్ విజయం: మూడు పార్టీల నుంచి వరుసగా గెలుపు

రిపోర్టర్: నరేష్ స్థలం: అనకాపల్లి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్ లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఛైర్పర్సన్ పిల్లా రమాకుమారి అరుదైన ఘనత సాధించారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. వేర్వేరు రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తూ ఆమె వరుసగా మూడోసారి ఛైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గతంలో టీడీపీ, వైసీపీల తరఫున గెలుపొందిన ఆమె, తాజాగా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి భారీ మెజారిటీతో విజయం సాధించారు. స్థానిక ప్రజలతో ఉన్న బలమైన అనుబంధమే ఆమె విజయాలకు ప్రధాన కారణమని తెలిపారు.