ఫౌజీ చిత్ర షూటింగ్కు తాత్కాలిక విరామం: దర్శకుడు హను రాఘవపూడికి గాయం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ చిత్ర షూటింగ్కు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. హైదరాబాద్లోని కోకాపేటలో జరుగుతున్న షూటింగ్ సమయంలో దర్శకుడికి కాలికి స్వల్ప గాయం కావడంతో రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ యథావిధిగా ప్రారంభం కానుందని మైత్రి మూవీ మేకర్స్ వర్గాలు స్పష్టం చేశాయి.