తీవ్ర తుపాను ముప్పు: నెల్లూరు – నర్సాపురం మధ్య తీరం దాటనున్న మురసు
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తీవ్ర తుపాను నెల్లూరు మరియు నర్సాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు మరియు మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.