కొడంగల్ పాంచ జన్య సంకల్ప సభలో డా బోడ అనిల్ కుమార్ నాయక్
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
తెలంగాణ రక్షణ సేన పాంచ జన్య సూత్రాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ఉచిత వైద్యం, విద్య, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం కోసం ప్రజలందరూ కవితమ్మకు బాసటగా నిలవాలని కోరారు. కొడంగల్ లో జరిగిన పాంచ జన్య సంకల్ప సభలో బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి డా బోడ అనిల్ కుమార్ నాయక్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేశారు.