వ్యవసాయ క్షేత్ర పర్యటనతో విద్యార్థులకు పర్యావరణంపై ప్రత్యక్ష అవగాహన

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలం ఆరేగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నాలుగో తరగతి విద్యార్థులకు పరిసరాల విజ్ఞానంపై ఉపాధ్యాయుడు మంకాల లింగస్వామి ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటన నిర్వహించారు. సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి మన చుట్టూ ఉన్న మొక్కలు, వాటి భాగాలు, తీగలు, పొదల గురించి వివరించారు. వరి సాగు విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం వల్ల విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని, ఇలాంటి అనుభవాలు వారిలో పరిశీలనా దృక్పథాన్ని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.