డీీప్ ఫేక్ ఫోటోల తొలగింపునకు మెటాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: హరి
స్థలం: ఢిల్లీ
ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో మహిళ మార్ఫింగ్ ఫోటోలను వెంటనే తొలగించాలని మెటా ప్లాట్ఫారమ్స్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించిందని న్యాయవాదులు తెలిపారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ఈ ఫోటోలను ప్రచారం చేశారని బాధితురాలు ఆరోపించారు. ప్రాణభయం ఉందని కోర్టుకు తెలపడంతో ఢిల్లీ పోలీసులు ఆమెకు పూర్తి రక్షణ కల్పించాలని న్యాయమూర్తి గిరీష్ కత్పాలియా స్పష్టం చేశారు. సౌరవ్ దాస్ సహా నలుగురు నేతలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను అక్టోబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.