కోనసీమలో రైలు మార్గం కోసం రోడ్డెక్కిన విద్యార్థి లోకం

రిపోర్టర్: మహేష్ స్థలం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా

కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రైల్వే నెట్‌వర్క్ వచ్చేంత వరకు ఉద్యమం ఆగదని జెన్-జీ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేసి, ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.