నిజం గెలిచింది.. పలాసలో చంద్రబాబు అరెస్టు దినం సందర్భంగా 53 దీపాలతో సంఘీభావం
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పిలుపు మేరకు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ కార్యాలయంలో నిజం గెలిచింది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గతంలో అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన ఘటనను గుర్తుచేసుకుంటూ 53 దీపాలు వెలిగించి శ్రేణులు సంఘీభావం ప్రకటించారు. ఎన్ని కుట్రలు జరిగినా చివరికి నిజమే గెలుస్తుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.