వైఎస్ జగన్ పై పులివెందుల పట్టణ పోలీసుల సంచలన కేసు నమోదు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Pulivendula

పులివెందులలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నా నిర్వహించడం, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.