యూఐఐసీ ఏఓ ప్రిలిమ్స్ హాల్టికెట్లు: అక్టోబర్ 15న ప్రవేశపత్రాల విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షా హాల్టికెట్లను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం రెండు వందల ఇరవై ఐదు ఖాళీలను భర్తీ చేయనుండగా అక్టోబర్ 22వ తేదీన ఆన్లైన్ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.