బరువు తగ్గడంలో కీటోజెనిక్ డైట్ ప్రత్యేకతపై వైద్య నిపుణుల స్పష్టత

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

బరువు తగ్గడం అనేది కేవలం తగ్గిన కేజీలపైనే కాకుండా ఫాలో అయ్యే ఆహారపు అలవాట్లపై కూడా ఆధారపడి ఉంటుందని చీఫ్ క్లినికల్ డైటీషియన్ డాక్టర్ శ్రీమతి వీణా వెల్లడించారు. సెల్ మెటబాలిజం పరిశోధన ఫలితాల ప్రకారం కీటోజెనిక్ డైట్ ఫాలో అయిన వారిలో ఫ్యాటీ లివర్ మరియు ఇన్సులిన్ నిరోధకతలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని తెలిపారు. అయితే అందరూ వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ డైట్ పాటించడం మంచిది కాదని హెచ్చరించారు.