చెన్నైలో నయనతార దంపతులతో ఒలింపియన్ పీవీ సింధు సందడి

రిపోర్టర్: గోపి స్థలం: చెన్నై

చెన్నైలో నటి నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ దంపతులు ఒలింపియన్ పీవీ సింధు, ఆమె భర్త వెంకట దత్త సాయికి ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ భేటీతో తమ మధ్య బంధం మరింత బలపడిందని, చెన్నై ఇప్పుడు మరింత సొంత ఊరిలా అనిపిస్తోందని సింధు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. నయనతార దంపతుల ఆతిథ్యంపై ఆమె ప్రశంసలు కురిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.