పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కొత్త యూనిఫాంలపై సోషల్ మీడియాలో సెటైర్లు
రిపోర్టర్: గోపి
స్థలం: పాకిస్థాన్
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సంస్థ 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త యూనిఫాంలను ప్రదర్శించగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సమస్యలు, విమానాల ఆలస్యం, ఏసీలు పనిచేయని వైనం వంటి కనీస వసతులు సరిచేయకుండా యూనిఫాంల మార్పుపై దృష్టి పెట్టడంపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.