గురుగ్రామ్‌లో థార్‌తో క్యాబ్‌ను ఢీకొట్టిన దుండగులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: గురుగ్రామ్
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని సెక్టార్ 89 ప్రాంతంలో శనివారం రాత్రి నలుగురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. ప్రయాణం కోసం క్యాబ్ ఎక్కుతున్న సమయంలో ఓ వ్యక్తి తన థార్ వాహనంతో క్యాబ్‌ను బలంగా ఢీకొట్టి, పలుమార్లు వెనక్కి ముందుకు తిప్పుతూ ధ్వంసం చేశాడు. ఈ ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో క్యాబ్‌లో ఉన్న ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.