గర్భిణి మృతికి ప్రభుత్వమే కారణమంటూ సీపీఎం తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

తుపాను ధాటికి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో ఆసుపత్రికి వెళ్లలేక గర్భిణి పాంగి లావణ్య మృతి చెందడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని సీపీఎం మండల కార్యదర్శి బుజ్జిబాబు ఆరోపించారు. బాధిత కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా అందించాలని తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.