నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఇస్రోలో 97 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: Sriharikota
దేశీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు చెందిన సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వివిధ విభాగాలలో తొంభై ఏడు ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు వచ్చే నెల నవంబర్ తొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అధికారిక వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్, నర్స్, డ్రైవర్ పోస్టులు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు.