'టెట్ నిబంధనలపై ఉప సంఘం ఏర్పాటు చేస్తాం': ఎన్సీటీఈ అధికారులు వెల్లడి

రిపోర్టర్: రాజేష్ స్థలం: దిల్లీ

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సిలబస్, అర్హత మార్కులు, పరీక్షా విధానాన్ని సమీక్షించి మార్పులు సూచించేందుకు ఉప సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్సీటీఈ అధికారులు వెల్లడించారు. దిల్లీలో ఎన్సీటీఈ అధికారులను యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్, ఎస్‌టీఎఫ్‌ఐ అధ్యక్షుడు సీఎన్‌ భారతి, ప్రధాన కార్యదర్శి చావా రవి కలిసి వినతిపత్రం సమర్పించారు. టెట్ నిబంధనలు, అర్హత మార్కుల తగ్గింపుపై వారు చర్చించగా, దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.