కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి: గంప గోవర్ధన్ నిరసన

రిపోర్టర్: సునీల్ స్థలం: Bibipet, Kamareddy, Telangana

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలను, హామీల అమలులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కామారెడ్డిలో బీఆర్ఎస్ సమరభేరి నిర్వహించింది. కేటీఆర్ పిలుపు మేరకు బీబీపేటలో జరిగిన ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని, ఇచ్చిన మాట తప్పిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.