నెల్లూరులో అభివృద్ధి ప్రయాణం: పన్నెండో డివిజన్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామని పొంగూరు నారాయణ వెల్లడించారు. పన్నెండో డివిజన్లో తన కుమార్తె సింధూతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించామన్నారు. గత రెండేళ్ల మూడు నెలల కాలంలో పాఠశాలలు, ముప్పై పార్కులు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులతో నెల్లూరు అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు. నారాయణ సంస్థల ద్వారా నిరుపేదలకు ఉచిత కంటి, దంత వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.