కుత్బుల్లాపూర్లో బీజేపీకి గట్టి షాకిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మహిళా మండల అధ్యక్షురాలు జి. స్వప్నతో పాటు గడ్డం గాయత్రి, మమత, రాధ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కొలన్ హన్మంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.