కోర్టు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగుతోంది: మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: అశోక్
స్థలం: కృష్ణా
కోర్టు దర్యాప్తు పూర్తిగా నిష్పక్షపాతంగా సాగుతోందని, ఆలస్యమైనప్పటికీ చివరికి న్యాయమే గెలుస్తుందని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అరాచక శక్తులు ఎంతటివారైనా ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన అందిస్తోందని, తప్పు చేసిన వారందరికీ తగిన శాస్తి జరుగుతుందని ఆయన తెలిపారు.