భాషా ప్రాశస్త్యాన్ని చాటుతూ ఘనంగా సాగిన హిందీ దివస్ వేడుకలు
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరంలోని జమ్ము సమీపంలో ఉన్న ఓక్ ల్యాండ్ పాఠశాల ప్రాంగణంలో హిందీ దివస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా పాఠశాల విద్యార్థులు హిందీ భాషా ప్రాముఖ్యతను చాటిచెప్పేలా కవితలు, ఉత్తేజపూరిత ప్రసంగాలు మరియు ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. 1949 సెప్టెంబర్ 14న దేవనాగరి లిపిని అధికారిక భాషగా గుర్తించిన చరిత్రను పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ రవి, ప్రిన్సిపాల్ సరితా మండల్ పాల్గొని విశిష్ట సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.