సర్వేపల్లి మండలంలో కాలువలోకి దూసుకెళ్లిన ఆటో ముగ్గురికి గాయాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం మల్లూరు పెట్రోలు బంకు సమీపంలో బుధవారం ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కాలువ నీటిలో మునిగిపోయిన మహిళ, వృద్ధురాలను వెంటనే స్పందించిన వాహనదారులు కాపాడారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో నెల్లూరు ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.